మున్సిపల్ కార్మికులకు గాయాలు

మున్సిపల్ కార్మికులకు గాయాలు విధులు నిర్వ‌హిస్తుండ‌గా క‌రెంట్ షాక్‌ కాకతీయ, కరీంనగర్ : విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మున్సిపల్ లైన్‌మన్ శివకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అలుగునూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. బొమ్మకల్‌కు చెందిన శివకృష్ణను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మేయర్ కొలగని శ్రీనివాస్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. శివకృష్ణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి...