విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడకలేదని, రుచి సరిగాలేదని సిబ్బందిపై ఆగ్రహం కాకతీయ, ఇనుగుర్తి :సాంఘిక సంక్షేమ పాఠశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులపై దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బుధవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గుర్తించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం ముద్దలుగా ఉండడం గమనించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. వంటశాలలో మెయిన్ కుక్...