శవాన్ని తీసుకెళ్లాలంటే
శవాన్ని తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌ను తోయాల్సిందే! ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి స్టార్ట్ కాక మొరాయించిన వాహనం… చివరికి ప్రైవేట్ అంబులెన్స్ ఆశ్రయం సిరిసిల్లలో హృదయవిదారక ఘటన కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.ఆప్తుడిని కోల్పోయిన కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుండగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ మొరాయించడం కలచివేసింది.రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూలి పనులు ముగించుకొని ఆటోలో వెళ్తుండగా వాహనం బోల్తా...