మేడారం గద్దెల వద్ద ప్రమాదం…
మేడారం గద్దెల వద్ద ప్రమాదం… పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు... నిర్మాణాల నాణ్యతపై విమర్శలు... ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు.... కాకతీయ, ములుగు ప్రతినిధి: తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. గద్దెల పరిసరాల్లో నిర్మించిన రాతి దిమ్మలు అకస్మాత్తుగా కూలిపోవడంతో సమ్మక్క ప్రధాన పూజారి కుటుంబానికి చెందిన బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన రానా రమేష్ కుమారుడు యువన్ (6) గద్దెల వద్ద ఆడుకుంటుండగా,...