పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించిన ఆమె, సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా సమీక్ష చేపట్టిన కలెక్టర్, రోగులకు అందుతున్న చికిత్స విధానం, సేవల నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔషధ నిల్వలను పరిశీలిస్తూ, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా...