సర్పంచ్ నిర్ణయంపై వివాదం..

సర్పంచ్ నిర్ణయంపై వివాదం.. పురోహితుడు ఆత్మహత్యాయత్నం శ్రీరామనవమి వేడుకల వేదిక మార్పుపై వివాదం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామంలో సర్పంచ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ ఆలయ పురోహితుడు వెంకన్నచార్యులు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సంవత్సరాలుగా ఒకే వేదికపై శ్రీరామనవమి కల్యాణ మహోత్సవం నిర్వహించే సంప్రదాయం ఉంది. అయితే ఈ ఏడాది సర్పంచ్ ఎవరినీ సంప్రదించకుండా...