కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు

కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు -బాలయ్యకు దక్కిన హక్కులు -వారసంత రోడ్డుపై నిర్వహణపై స్థానికుల ఆందోళన -కేటాయించిన స్థలంలోనే జరపాలని డిమాండ్.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం నిర్వహించిన వారసంత వేలం ఉత్సాహంగా జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ వారసంతకు సంబంధించిన హక్కులను చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బాలయ్య రూ.4,14,000కు దక్కించుకున్నారు. వేలం ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించగా, గ్రామస్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అయితే, వారసంత నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా...