భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ కాకతీయ, వరంగల్ సిటీ : వసంత నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఓరుగల్లు మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్ర మహోత్సవాలు గురువారంతో ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం అనంతరం కల్పోక్త విధానంలో జపహోమాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వైభవంగా లక్షపుష్పార్చన అమ్మవారికి...