ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ శ్రీనివాస్ హెచ్చరిక కాకతీయ,చెన్నారావుపేట : ఖాదర్‌పేట శివారులో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రమాదకర మూలమలుపును పోలీసులు గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రమాదాలను నివారించేందుకు ఆ ప్రదేశంలో హెచ్చరిక సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెక్కొండ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, వాహనదారులు వేగవంతంగా నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మూలమలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ప్రాణ భద్రత...