సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ

సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ కాకతీయ, జమ్మికుంట : ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ సందడిగా సాగింది. విద్యార్థినులు ప్రదర్శించిన శాస్త్రీయ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సందర్శించారు. విద్యార్థినుల ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు....