శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

శ్రీరామనవమి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి మహేష్ బీ గీతే జిల్లా ఎస్పీ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు....