కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి
కేంద్ర నిధులతో గ్రామాభివృద్ధి బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ సీసీ రోడ్డు పనులకు శ్రీకారం కాకతీయ, శంకరపట్నం : కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర నిధులే కీలకమని పేర్కొన్నారు. మండలంలోని వంకాయగూడెం గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా మంజూరైన రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ వెన్నం మల్లేష్ కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏనుగుల అనిల్...