వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం
వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భక్తులతో పోటెత్తిన పుణ్యక్షేత్రం రామ నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం కాకతీయ,రాయపర్తి /పాలకుర్తి :వాల్మీకి మహర్షి తపస్సు చేసిన పుణ్యభూమిగా పేరుగాంచిన పాలకుర్తి మండలంలోని వల్మిడి గుట్టపై వెలసిన సీతారామ లక్ష్మణుల ఆలయ పుణ్యక్షేత్రం పులకించిపోయింది.శుక్రవారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణోత్సవం కనులపండువగా జరిగింది.ఈ నేపథ్యంలోఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యాక్షరాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు...