కమనీయం… రాములోరి కల్యాణం

కమనీయం… రాములోరి కల్యాణం కన్నుల పండువగా వివాహ వేడుక రామనామస్మరణతో మార్మోగిన వేములవాడ కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన హరిహర క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా,ఆధ్యాత్మికోత్సాహంతో నిర్వహించారు. “జై శ్రీరామ్… జై శ్రీరామ్…” అంటూ మారుమోగిన నినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తి తరంగాల్లో తేలిపోయింది.వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని కళ్లారా వీక్షిస్తూ పరవశించారు. అభిజిత్ లగ్నంలో శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం ఉదయం 11:50...