వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కల్యాణం
వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కల్యాణం.. కాకతీయ,శంకరపట్నం: మండల వ్యాప్తంగా శుక్రవారం రోజు శ్రీరామనవమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కేశవపట్నం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా, పండితులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతుల్లో కల్యాణ వేడుకలను నిర్వహించారు. మంగళవాయిద్యాల నాదం మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేసింది. ఈ సందర్భంగా మహిళలు...