కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శనివారం రోజు సర్పంచ్ నూనె రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 388 పశువులకు టీకాలు వేశారు. పశువుల ఆరోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ టీకాల కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలోని పశుపోషకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పశువులను వ్యాధుల నుండి రక్షించుకోవడానికి రైతులు...