ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ!
ఆశ్రమ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ! భోజనం.. మెనూ అమలుపై విద్యార్థుల నుంచి ఆరా గేట్ రేలకాయలపల్లి హాస్టల్‌లో అధికారుల పరుగులు! కాకతీయ, కారేపల్లి : మండల కేంద్రంలోని గేట్ రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ను శనివారం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎవరికీ ముందస్తు సమాచారం లేకుండా నేరుగా పాఠశాలకు చేరుకున్న ఆమె, హాస్టల్ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఆకస్మిక పర్యటనతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. తనిఖీలో భాగంగా అడిషనల్...