అంగన్వాడీలకు ఆధునిక సదుపాయాలు పిల్లల హాజరు పెంపే లక్ష్యం

అంగన్వాడీలకు ఆధునిక సదుపాయాలు పిల్లల హాజరు పెంపే లక్ష్యం మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని తీగలగుట్టపల్లి 1వ అంగన్వాడీ కేంద్రంలో ‘సాక్షం అంగన్వాడీ’ కార్యక్రమంలో భాగంగా తాగునీటి శుద్ధి యంత్రాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 269 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్కటికి లక్ష రూపాయల వ్యయంతో ఎల్‌ఈడీ టీవీలు, చిన్నారుల ప్రారంభ విద్యా సామగ్రి, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, బాలల చిత్రలేఖనం, పోషణ తోటల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు....