రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి : చావా రవి డిమాండ్ కాకతీయ, హనుమకొండ : మార్చి 2024 నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. సోమిడి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు కన్నా సోమయ్య పదవి విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత బకాయిలు ఆలస్యమవడంతో పలువురు ఉద్యోగులు మానసిక ఆందోళనకు...