రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూరు గ్రామంలో రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటన కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను సక్రమంగా క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.