కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ, చేర్యాల: కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలమని రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆకట్టుకున్నారు.విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు...