లంచగొండు పంచాయతీ కార్యదర్శి..
లంచగొండు పంచాయతీ కార్యదర్శి.. ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో లంచాల దందా..? రాజాపూర్ కార్యదర్శిపై తీవ్ర ఆరోపణలు -గ్రామస్తుల ఆవేదన కాకతీయ,శంకరపట్నం:మండలంలోని రాజాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిపై లంచాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ల పర్మిషన్ల మంజూరు విషయంలో, అలాగే పింఛన్లు మంజూరు చేస్తానంటూ కార్యదర్శి మహబూబ్ పాషా వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పర్మిషన్లు ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, కొన్ని సందర్భాల్లో నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఆన్లైన్ లావాదేవీల రూపంలో పంపిన డబ్బుల వివరాలను కూడా వారు...