నాణ్యమైన ఆహారం తప్పనిసరి
నాణ్యమైన ఆహారం తప్పనిసరి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మౌలిక సదుపాయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. మంగళవారం జూలూరుపాడు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అండ్ జూనియర్ కళాశాల, పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల విద్యా స్థాయి, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు,...