గ్రామాభివృద్ధియే మా లక్ష్యం
గ్రామాభివృద్ధియే మా లక్ష్యం : సర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ కాకతీయ, కారేపల్లి:- గ్రామాభివృద్ధియే మా లక్ష్యమని సర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిధులను ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం పాటిమీద గుంపు గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి పెద్దపీట...