అకాల వర్షంతో పంటలకు దెబ్బ
అకాల వర్షంతో పంటలకు దెబ్బ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కాకతీయ, జగిత్యాల : జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో కోత దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి, పెంబట్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన, లక్ష్మీదేవిపల్లిలో రైతు రవి నాయక్‌కు చెందిన బీరకాయ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో మాట్లాడిన జీవన్‌రెడ్డి, జిల్లాలో...