సమానత్వం సాధించాలంటే చదువే మార్గం
సమానత్వం సాధించాలంటే చదువే మార్గం మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ కాకతీయ, పెద్దవంగర : సామాజిక, ఆర్ధిక,రాజకీయ సమానత్వం రావాలంటే చదువే ముఖ్యమని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం టీపీటీఫ్ పెద్దవంగర మండల శాఖ ఆధ్వర్యంలో మహనీయుల స్మృతి మార్నింగ్ వాక్ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి మాట్లాడారు. గతంలో ఉన్న కుల వివక్షతలను, మూఢనమ్మకాలను మహిళల పట్ల వివక్షతను రూపుమాపడానికి,ప్రజలను చైతన్య పరచడానికి జ్యోతి రావ్ పూలె పోరాడడాన్నారు. దేశంలో కుల,మత, లింగ,ఆర్ధిక సమానత్వం సామాజిక, ఆర్ధిక,రాజకీయ...