ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా?
ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా? మధ్యతరగతిపై కొత్త భారం.. ఖిలావరంగల్‌లో ప్రజల్లో చర్చనీయాంశం కాకతీయ, ఖిలావరంగల్: ఇంకమ్ టాక్స్ చెల్లిస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు తొలగించడం సరైన ప్రమాణమా అనే సందేహాలు మధ్యతరగతి కుటుంబాల్లో వ్యక్తమవుతున్నాయి. చిన్న ఆదాయం ఉన్నవారికీ అనర్హుల ముద్ర పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అనర్హులను తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పినా, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై ప్రభావం పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యతరగతికి...