భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కాకతీయ, రాయపర్తి: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గురువారం పెద్దమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. అర్చకులు, గ్రామ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. భక్తులు బోనాలు సమర్పిస్తూ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా...