ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ,చేర్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సభలో సర్పంచ్ కొమురయ్య మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు సభలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కింద గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు...