ప్రతి పౌరుడికి న్యాయం జరగాలనేదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం
ప్రతి పౌరుడికి న్యాయం జరగాలనేదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం.. *ప్రజలు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి *కొనాయిమాకుల గ్రామసభలో కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కాకతీయ, గీసుగొండ: ప్రజా ప్రభుత్వంలో ప్రతి పౌరుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొనాయిమాకులలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామ సర్పంచి వజ్ర రాజు,మండల ప్రత్యేక అధికారి సురేష్ తహసిల్దార్...