రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు మార్కెట్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ..! కాకతీయ, వరంగల్ : వరంగల్ లో మరో అడ్తీ వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే...