కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కాకతీయ, పెద్దపల్లి రూరల్ : ముత్తారం గ్రామ శివారులోని డి-83 కాల్వలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాల్వ నుంచి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మోర్టువరీకి తరలించారు.మృతుడు నలుపు రంగు రౌండ్ నెక్ టీషర్ట్ ధరించి ఉండగా, కుడిచేతికి గోల్డ్ రంగు బ్రాస్లెట్ ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే పెద్దపల్లి రూరల్ పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన నంబర్లు: 8712656507...