అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఇద్దరు యువకులు మృతి కాకతీయ, కరీంనగర్ : నగర శివారులోని బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇంకొకరు స్వల్ప గాయాలతో...