డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్ వ్యాపారులు, ప్రజల స్వచ్ఛంద మద్దతు… పూర్తి స్థాయిలో మూతపడిన దుకాణాలు కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణం శుక్రవారం ప్రజా గర్జనతో మార్మోగింది. ‘వేస్ట్ టు ఎనర్జీ’ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపుతో చేపట్టిన బంద్‌కు విస్తృత స్పందన లభించింది. పట్టణం మొత్తం ఒకే స్వరంతో నిరసన వ్యక్తం చేయడంతో డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం మరింత ఉధృతమైంది. ఉదయం మొదలైన బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు,...