జోరుగా ఇసుక అక్రమ రవాణా
జోరుగా ఇసుక అక్రమ రవాణా ఏటూరునాగారంలో రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు గ్రామస్థులు అడ్డుకుంటున్నా ఆగని దందా అధికారుల స్పందనపై సందేహాలు కాకతీయ, ఏటూరునాగారం : ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఏటూరునాగారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో రాత్రివేళల్లో భారీగా ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తులు “ఇందిరమ్మ” పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ పది ట్రాక్టర్లకు పైగా ఇసుక రవాణా జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్లు గ్రామ...