ఎన్‌సిసి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
ఎన్‌సిసి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం కాకతీయ, జమ్మికుంట : ఎన్‌సిసి ద్వారా క్రమశిక్షణ గల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని జమ్మికుంట ఎన్‌సిసి ఉపాధ్యాయుడు మేకమల్ల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్‌లో తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఉగాది పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్ బాబు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. దేశానికి క్రమశిక్షణ గల సైనికులను అందించడంలో ఎన్‌సిసి కీలక పాత్ర పోషిస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థులు...