నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి
నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలి వైద్యులు సమయపాలన పాటించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఉచిత మందులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని...