ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలి విద్యార్థులు మానసిక వేదనలో ఉన్నారు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు కాకతీయ, ఖమ్మం : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్‌పై హైకోర్టు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. విద్యార్థుల విద్యా భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొని, వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని...