క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి
క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభం రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర కాకతీయ, కొత్తగూడెం : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గాయత్రీ క్రికెట్ మెమోరియల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని...