లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం
లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం కాకతీయ, కరీంనగర్ : సేవా కార్యక్రమాల్లో ముందుండే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్కాపూర్ ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం స్థానికంగా విశేష స్పందన పొందింది. శిబిరాన్ని 16వ డివిజన్ కార్పొరేటర్ కంతాల జగన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని అవసరార్థులకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజరాజేశ్వరి కరీంనగర్ ఈ శిబిరాన్ని నిర్వహించింది. మొత్తం 65 మందికి...