వాగులో గుడుంబా తయారీ

వాగులో గుడుంబా తయారీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో అక్రమ గుడుంబా తయారీ కొత్త రూపం దాల్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాగు మధ్యలో గుంతలు తవ్వి ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా గుడుంబా తయారు చేస్తున్నారని గ్రామస్తులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, వాగులో నీటి మధ్య గుంతలు తవ్వి వాటిలోనే గుడుంబా తయారీ జరుగుతుండడంతో బయటకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని, అందువల్ల ఈ అక్రమాన్ని గుర్తించడం అధికారులకు కష్టమవుతోందని తెలిపారు. ఈ కొత్త...