ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు కాకతీయ, హనుమకొండ : మడికొండ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, మేయర్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా కో-కన్వీనర్ పొనగోటి వెంకట్ రావు, గడ్డం మహేందర్, నార్లగిరి రామలింగం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న స్థాపితమైన బీజేపీ అంత్యోదయ లక్ష్యంతో దేశంలోని చివరి...