అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు
అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు కాకతీయ, కరీంనగర్ : డివిజన్ల మ్యాపింగ్ పేరుతో చేపడుతున్న ఓటరు సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమేనని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి విమర్శించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు) గడప గడపకు తిరిగి ఓటర్ల వివరాలు సరిచూడాల్సి ఉండగా, స్థానిక కార్పొరేటర్ల ప్రభావంలో ఒకే చోట కూర్చుని మ్యాపింగ్ నిర్వహిస్తూ తప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు....