ముల్కనూర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
ముల్కనూర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని అధికారులు, సిబ్బందితో సమావేశమై పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అర్రైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై...