పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేషన్ పరిశీలన
పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేషన్ పరిశీలన కాకతీయ,శంకరపట్నం: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా బుధవారం శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించి, అమలు విధానంపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ కార్యక్రమ నిర్వహణ, లక్ష్యాల సాధనపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రంలోని ఐఎల్‌ఆర్, వ్యాక్సిన్లు, వాటి నిల్వ విధానం, టెంపరేచర్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫార్మసిస్ట్ అర్చన వ్యాక్సిన్ల నిల్వ, పంపిణీ తదితర...