ఆదర్శంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి
ఆదర్శంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నాలుగు అవార్డులతో మరోసారి ప్రతిభ వైద్య సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందనలు కాకతీయ, పెద్దపల్లి : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్థాయి అవార్డుల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నాలుగు అవార్డులు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. సూపరింటెండెంట్, సివిల్ సర్జన్ (అనస్తీషియా) డాక్టర్ కే. శ్రీధర్ ఉత్తమ సేవలకు ప్రథమ...