రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకతీయ, మంగపేట : రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ గుమ్మడి సోమయ్య తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో వివేకా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు....