ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఊరూరా డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాకతీయ, గీసుగొండ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఊరూరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, ఎంపీడీవో కృష్ణవేణి, పాక శ్రీనివాస్ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి...