కరీంపేటలో గ్రంథాలయం ఏర్పాటు..

కరీంపేటలో గ్రంథాలయం ఏర్పాటు.. హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.. కాకతీయ,శంకరపట్నం:అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని కరీంపేట గ్రామంలో మంగళవారం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన గుర్రం రాజశేఖర్ గౌడ్ (ఎస్పీఎఫ్ కానిస్టేబుల్) మరియు పంచాయతీ కార్యదర్శి పి. సుమన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా గ్రామంలోని విద్యార్థులు, యువత చదువుకునే వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గ్రంథాలయం ద్వారా గ్రామ యువతలో విద్యాపట్ల ఆసక్తి...