ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ,గీసుగొండ : ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గీసుకొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ హెచ్చరించారు. ఆదివారం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిసి తొలగించినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 95లో గల 28 ఎకరాల మల్లికుంట శిఖం భూమిని గతంలో ఐయన్ గా కన్వర్ట్ చేసి,58, 59 జీవోల...